Wednesday, September 10, 2008

ఆయ్ మేమంటే అంత చులకనా!!

సాఫ్టువేరు ఇంజనీర్లంటే అందరికి ఎంత లోకువో.

సినిమాలోళ్ళ దెగ్గర నుంచి దారిన పోయే దానయ్యల వరకు అందరికీ వీరి మీద వారి వారి అభిప్రాయాలే.
అవునయ్య నేనూ సాఫ్టువేరు ఇంజనీర్ నే, అందుకే డిఫెండ్ చేసుకుంటున్నా... ఏం తప్పా??
ఒకడిని చూస్తే బ్రాహ్మి సాఫ్టువేర్ ఇంజనీరని, ఏజ్ బార్ ఐన ఒక
డొక్కు గాన్ని చూపించి సాఫ్టువేర్ ఇంజనీర్ కి ప్రతీక గానిలబెట్టేస్తారు.

ఇంకొకడిని చూస్తే పనికిరాని వెధవలందరూ సాఫ్టువేర్ లోనే తగలడినట్టు, చటుక్కున జాబు తెచ్చుకొని లటుక్కున ఫారిన్ఛాన్స్ కొట్టేసి, ఆడపిల్లల వెంట పడేటట్టు చూపిస్తాడు.

గుడ్డిలో మెల్ల లా ఒక్కో సినిమాలో సంతోషంగా ఉన్నట్టు కూడా చూపిస్తారనుకోండి.

ఇక సినిమాలిలా ఉన్నాయి అనుకుంటే బయట అడుగు పెడితే చాలు ఆటో వాడి దగ్గర నుండి, ఇల్లద్దెకిచ్చే వాడి వరకూసాఫ్టువేర్ ఇంజనీర్ని దోచుకోవాలనుకునేవాడే.

మా కంపెనీ ఎదురుగా ఆటోలుంటాయి. ఎక్కడికయినా వెళదామని వాడినడిగామా మీటరు మీద ఇరవై రూపాయలుసార్ అని పళ్లికలిస్తాడు , వెనక కంపెనీ వంక చూస్తూ, సర్లే పక్కనోదేమైనా వస్తాడేమో కనుక్కుందాం అనుకుంటేవాళ్ళంతా ఒకటే (ఇలాంటి వాటిల్లో మాత్రం సంఘటితంగా ఉంటారు). అప్పటికే రెండున్నర రెట్ల వేగంతో తిరుగుతున్నమీటర్ మీద ఇరవై రూపాయలు ఎక్కువ సమర్పించుకొని పక్కనున్న ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి.

ఇక ఇంటద్దె కోసం స్నేహితులు వెళ్తే ఎక్కడ పని చేస్తున్నావని అడిగి, సాఫ్టువేర్ అని వినపడగానే దొరికాడురా బకరా అనిఅనుకుంటారు. అదీ బాచిలర్ అయితే ఇక వాళ్ల పంట పండినట్టే. సడన్ గా ఇంటద్దె రెట్టింపయిపోతుంది. ఏం అంతసంపాదిస్తున్నవుగా ఇవ్వడానికేం దురద అని చూస్తారు. ఇంకొందరయితే మీకు కంపెనీ లీజు వస్తుందిగా అని రేట్లు ఇంకాపెంచేస్తారు, ఏదో కంపెనీ మనకు ఫ్రీ గా ఇచ్చేస్తున్నట్టు, మనం సిటిసి చక్రం లో ఉన్నట్టు తెలీనట్టు నటిస్తారు.

ఇక సర్లే ముగ్గురం కదా పదిహేనువేలు వాటాలో ఐదు వేలేగా అని జనాలు సమాధాన పరచుకొని వారికి బంగారుబాతులవుతారు.

ఇదంతా ఒక ఎత్తైతే.. ఇక బట్టలు, సినిమాలు, మాల్స్, తిండి ఏది చూసినా బొక్కే. ఇవ్వన్ని చెయ్యకుంటే సాఫ్టువేర్ఇంజనీర్ కాదన్నట్టే లెక్క జనాలకి మరి. మల్టిప్లెక్సు లోనే సినిమాలు చూడాలి. లీ, లేవిస్ జీన్స్ కట్టాలి. పిజ్జా, బర్గర్, కాఫీ, షాపులలోనే వీకెండ్స్ తిండి తినాలి. మాల్స్ లోనే షాపింగ్ కి వెళ్ళాలి.

ఏదైనా చెయ్యకపోతే మళ్ళి పక్కనోళ్ళు
వెర్రి వాజమ్మ కింద జమకట్టేస్తారో అని భయం.

ఇకపోతే ఇంటిపక్కనోళ్ళు, బంధువులు, స్నేహితులు వీరి పైన పెట్టె ప్రెస్సర్ చూడాలి. అదేంటి బాబు నువ్వప్పుడేఉద్యోగంలో జాయిన్ అయ్యి మూడేళ్లు అయ్యింది. ఒక్క జాబు కూడా మారలేదా? మా వాడు అప్పుడే నాలుగు ఉద్యోగాలుమారిపోయాడు తెలుసా.

ఇంకోడు అర్రే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతేనా వచ్చేది. మా చుట్టాలబ్బాయికి ఐతే పది లక్షల జీతం వస్తుంది అని జాలిచూపుతాడు.

ఇంకోడేంట్ర అంటే నేను కనిపించగానే తెలుగులో కాక ఇంగ్లీషులో మాట్లాడతాడు, నేను తెలుగుగో మాట్లాడినా .. ఇదెక్కడిగొడవరా బాబు నేను సాఫ్టువేర్ ఇంజనీర్ నేనా అన్నట్టు డౌట్ గా చూస్తాడు.

ఇక స్నేహితులు కలిస్తే నీకెంత రా నాకెంతరా లు మామూలే.

ఇక మామూలోళ్ళు అందరూ నీకేంటి ఐదు రోజులే పని, రోజుకెనిమిది గంటలే పని వేలలు అని ఎక్కించేస్తుంటారు. అక్కడవారానికి పది రోజుల పని చేస్తూ, రాత్రి నిద్రపోకుండా పని చేసేవాడు ఎక్కడ చెబితే అలుసైపోతామేమో అని ఎహేహే అనిఒక పిచ్చి నవ్వు నవ్వుతాడు.

ఇవ్వన్నీ తట్టుకొని ఎక్కడికక్కడ జేబులు గుల్ల చేసుకొని, మాటలు పడి నెగ్గుకురావడం అంత ఈజీ కాదని మనవి. కాబట్టి సారి మీకో సాఫ్టువేర్ ఇంజనీర్ కనిపిస్తే బ్రాహ్మి సాఫ్టువేర్ ఇంజనీర్ ని కాకుండా
బిల్ గేట్స్ నో, స్టీవ్ జాబ్స్ నో గుర్తుతెచ్చుకోమని మనవి.

No comments: