Thursday, April 15, 2010

దేని కోసం?

శ్రీ శ్రీ గారి పద కవితా స్ఫూర్తితో ,

వేళ కాని వేళలలో,
దారి కాని దారులలో,
కానరాని కాంక్షలతో,
దేనికోసమీ దేవులాట !

ఆకలితో అలసటతో,
ఎందుకోసమీ ప్రాకులాట !

నిశీధి రాతిరి హోరు గాలిలో,
చావు పుట్టుకల పొలిమేరల్లో,
అవ్యక్తపు ఊహలతో,
ఎందుకీ నిర్లిప్తత !

ప్రపంచమంతా నిదురొన్న నడి రాతిరి,
నీలోనే నీకేదో ఆవేదన.. ?

ఎందుకీ అన్వేషణ ?
ఎక్కడికీ ప్రస్థానం ?

No comments: