Monday, May 10, 2010

చేదు పాట

శ్రీ శ్రీ గారి శత జయంతి సంధర్భంగా, ఆయన రాసిన, నాకు నచ్చిన "మహాప్రస్థానం" లోని ఒక చిరు కవిత ...

ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది,
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!

లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో!
బ్రతుకు వృధా, చదువు వృధా,
కవిత వృధా! వృధా, వృధా!

మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగులం!
వెనుక దగా, ముందు దగా,
కుడి ఎడమల దగా, దగా!

మనదీ ఒక బ్రదుకేనా?
కుక్కలవలె, నక్కలవలె!
మనదీ ఒక బ్రదుకేనా?
సందులలో పందులవలె!

నిజం సుమీ, నిజం సుమీ,
నీ వన్నది నిజం సుమీ,
బ్రతుకు ఛాయా, చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ!

లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం జీవఫలం!
జీవఫలం చేదు విషం,
చేదు విషం, చేదు విషం!

ఔను నిజం, ఔను సుమా,
ఔను నిజం నీ వన్నది!
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం,నిజం!

-- శ్రీ శ్రీ

No comments: